SPREAD NEWS;-తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పరంగా చిన్న కదలిక జరిగినా, వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆ పార్టీ గొప్పలు పోయేది. వారికి మద్దతిచ్చే మీడియా తిరిగి దాన్నే ఊదరగొట్టేది. చంద్రబాబును పొగడడానికి విశేషణాలు చాలేవి కావు. కానీ అంతకంటే చొరవతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. వారికి మద్దతిచ్చే మీడియా లేని తప్పులను వెతుకుతూ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు. సాగుతున్న సంక్షేమ పథానికి తోడుగా, అభివృద్ధి రథం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరుగులు తీయనుంది. ఇది జీర్ణించుకోవడం కొందరికి కష్టమే.
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు రాకుండా చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా తెలుగు దేశంకు మద్దతిచ్చే మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అదానీ గతంలో ఎన్నికలకు మూడు నెలల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే, వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రచారం చేసిన ఇదే మీడియా, ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిస్తే మాత్రం ‘ఆంధ్ర సూర్యుడు అదానీ’ అంటూ వ్యతిరేక కథనాన్ని ఇచ్చి తన ద్వేషాన్ని వెళ్లగక్కింది. మీడియా అన్నాక ఎందులో అయినా లోటుపాట్లను, అవకతవకలను రాయడం తప్పు కాదు.
ఏపీలో సుమారు 8 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జాతీయ సౌరశక్తి సంస్థ ఒక ప్రతిపాదన చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్ అదానీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఖరారయ్యాయట. జాతీయ సౌర శక్తి సంస్థ ప్రతిపాదన కనుక ఏపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఏవైనా ఆరోపణలు చేయడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అంతకుముందు ఆరువేల మెగావాట్లకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, అందులో అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టుకు వెళ్లడం, కోర్టు వాటిని నిలుపుదల చేయడం జరిగింది. మరి అందులో టీడీపీ వర్గం పాత్ర ఎంత ఉందో తెలియదు.