మా లో కొనసాగుతున్న రగడ

   


 SPREAD NEWS;- ప్రకాష్ రాజ్ విష్ణు మధ్య మొదలైన మా గొడవలు. మా ఎలక్షన్ ఏ విధంగా జరిగినయో అందరికీ తెలుసు. రాజకీయ ఎన్నికలను మరిపించిన మా ఎన్నికలు. క్షణక్షణం టెన్షన్తో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మాటల తూటాలతో జరిగిన ఎన్నికలలో విష్ణు వర్గం మెజార్టీ సాధించి గెలుపొందారు. దీంతో మాలో మొదలైన రగడ, నిన్న ప్రకాష్ రాజు రాజీనామా చేయగా, నాగబాబు రాజీనామా చేశారు. దీని వెనక పెద్ద ప్లానే ఉన్నట్టు అర్థం అవుతుంది. మా అసోసియేషన్  చీలిక పోతుందని వినికిడి. దానికి తగ్గట్లు ఈరోజు ప్రకాష్రాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతుంది?  ఈ మీటింగ్లో మూకుమ్మడిరాజీనామాలు చేయబోతున్నారని వినికిడి. మాతెలుగు  మూవీ అసోసియేషన్ ముక్కలు కాబోతుందని సమాచారం. ప్రకాష్ రాజ్ ప్యానల్ అందరూ కలిసిమూకుమ్మడి రాజకీయ రాజీనామాలతో ముక్కలు చేయబోతున్నారని.తద్వారా ఇంకొక అసోసియేషన్ స్థాపించడానికి అడుగులు ముందుకు పడుతున్నాయని, ఇప్పటికే దానికి సంబంధించి ఆఫీసు కూడా  ప్రకాష్ రాజు తీసుకున్నాడని, ఏది ఏమైనా ఈ విషయాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటిలాగానే మా అసోసియేషన్ ఒక్కటిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని సమాచారం.