పాకిస్థాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా

       


SPREAD NEWS;-భారతదేశ సరిహద్దుల్లో అలజడిని సృష్టించేందుకు ప్రతిరోజు కుట్రలు చేస్తున్న పాకిస్తాన్ దేశాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణ పాల్పడిన కాశ్మీర్ రాష్ట్రంలోని అమాయక ప్రజల్ని బలి చేసే ఉగ్రవాదాన్ని సమర్థించి, ఉగ్రవాదులని మా మీదకు ఉసిగొలిపితే పాకిస్తాన్ దేశాన్ని పొదిలి పెట్టబోమని తగు సమాధానం చెబుతామని హెచ్చరించారు. గతంలో భారత్పై దాడి చేస్తే సర్జికల్ దాడులతో సమాధానం చెప్పామని భవిష్యత్తులో కూడా పాకిస్థాన్తో ఇదేవిధంగా జవాబు ఇస్తామని, గోవాలోని నేషనల్ ఫోర్ సిక్స్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి సారథ్యంలో, పాకిస్తాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఓ కీలక అడుగు అని ఇప్పుడు సమయం ఆసన్నమైందని అన్నారు.

     చర్చలకు కూడా అవకాశం లేకుండా తగిన బుద్ధి చెబుతామని గతంలోఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్లో, ప్రతీకారం  తీసుకున్నాము పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే, వచ్చే ఏడాది జరిగే ఎలక్షన్లలో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారం సొంతం చేసుకుందామని అమిత్ షా అన్నారు.ఈ దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఉరీ దాడి జరిగిన 11 రోజుల తర్వాత 2016 సెప్టెంబర్ 29 న సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.

    డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతుందని, దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో నవంబర్15 నుంచి విమానాలు కూడా అనుమతి ఇస్తున్నామని. గోవా సీఎం మనోహర్ పారికర్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకుని వచ్చి రాష్ట్రం కోసం పాట్లు పడ్డాడు అని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ద్వారా సైన్యంలో పనిచేసే ప్రతి అందరికీ గుర్తుంది పోతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రస్తుత సీఎం ప్రమోద్. మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తరహాలో పని చేయాలని కోరారు.