ఏపీ ఆర్థిక పరిస్థితి పై కాగ్ సంచలన రిపోర్ట్

       


SPREAD NEWS;- కాగ్ ఎప్పటికప్పుడు తన రిపోర్టులతో ప్రభుత్వాలని హెచ్చరిస్తుంది. అదేవిధంగా గత ఏడాది  ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఆదాయాన్ని పోలిస్తే ఇప్పుడు ఆదాయం గణనీయంగా పెరిగిందని కాగ్ తన నివేదికలో వెల్లడించి, సంచలన ఆరోపణలు చేసింది. ఐదు నెలల తో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని తన నివేదికలో పేర్కొంది. గత గత ఏడాది ఐదు నెలల్లో రూ.37,470.65 కోట్ల ఆదాయం ఉండగా, ఈ ఏడాది అదే కాలానికి  రూ.53,159.11 కోట్ల మేర ఆదాయం వచ్చిందని. గత ఏడాదితో పోలిస్తే రూ.15,688 కోట్ల మేరా ఆదాయం వచ్చింది అని తన రిపోర్టులో పేర్కొంది. 

     పన్నుల ద్వారా సుమారు  రూ.12 వేల కోట్ల  ఆదాయం రాగా, కేంద్రగ్రాంట్ల ద్వారా రూ.3,213 కోట్ల ఆదాయం వచ్చిందని,  మద్యంపై ఏఈఆర్జి ఛార్జీలు, స్థానిక సంస్థల్లో యూజర్ చార్జీలు పెరిగినట్లు పేర్కొంది. ఆదాయం తో పాటు అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగాయి. ఐదు నెలల్లోరూ.31,188 కోట్లు ఉన్నట్లు రెవెన్యూ లోటు  ఉంది. ఐదు నెలల్లో సంక్షేమానికి రూ. 8677 కోట్లఖర్చు  పెరిగిందని పేర్కొంది.

     ఈ కాలంలోరూ. 36,976 కోట్లు  రుణాలు తీసుకున్నట్లు కాగ్ తెలిపింది.  సంక్షేమంతో పాటు ఇతర ఖర్చులు కూడా పెరగడంతో రెవెన్యూ లోటు అంచనాల కంటే భారీగా ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. ఆదాయం పెరుగుతూ ఉండటంతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించగలమని ఏపీ ప్రభుత్వం ధీమాగా ఉంది. ఇది ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి మంచి పరిమాణం.