నారాయణ నీవు మతిభ్రమించి మాట్లాడుతున్నవా..?

   వైఎస్ జగన్ ధర్మరాజులా భార్యను తాకట్టు పెట్టే పరిస్థితి  తెచ్చుకుంటే కొంపకొల్లేరవుతుంది - సీపీఐ నారాయణ

     


SPREAD NEWS;-నిరుపేదలకు కూడు, గూడు, గుడ్డ కమ్యూనిజం బేసిక్ సిద్ధాంతం అనేది మరిచి పోయినట్లు ఉన్నావ్,కమ్యూనిస్టు..  కమ్మనిస్టులతో కలిసిపోయి.. నోటికి వచ్చినట్లు కూస్తున్నావ్.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలు,నిరుపేదలకు ఇంటింటికి అందిస్తున్నాడ‌ని కడుపు మంట పుట్టిందా నారాయణ.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సమగ్రంగా ఆమలు అవుతున్నాయి.నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు  ఉద్య‌మాల‌కు మీరు పిలిచినా రావడం లేదని బాద‌నా?కమ్యూనిస్టులకు ఉద్యమాలు  కరువయ్యి,ఉపాధి కోల్పోయారా.

    పెద్ద,మధ్యతరగతి వర్గాలు  ఆర్థికంగా ఎదగడం మీకు  ఇష్టం లేదా.మీరు కూడా పచ్చ బ్యాచ్ తో పొల్యూట్ అయ్యారన్న సంగతీ అందరికి తెలుసులే నారాయణ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంక్షేమ- అభివృద్ధి అనేవి రెండు కళ్ళు.కరోనా కష్టకాలంలో చేతినిండా పనిలేక,తినడానికి తిండిలేక.ఇతర రాష్ట్రాల్లో చనిపోయింది గుర్తుకు లేదా నారాయ‌ణ‌.ఏపీలో అలా ఒకరైన చనిపోయారా.కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని ఆర్థికవేత్తలు అంటున్నా వినబడదా.

    నవరత్నాల అమలుతో పేదవాడు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు.నిత్యం చంద్రబాబు అద్దె మైకులా మాట్లాడుతావ్.ధర్మరాజు తన భార్యను తాకట్టు పెట్టారన్నది ఇతిహాసం.నీలాంటి వాళ్ళు చెప్పే నీతి సూత్రాలు వినేరోజులకు ఎప్పుడో కాలం చెల్లింది కామ్రేడ్.ఇలాంటి సమయంలో కూడా ఏపీలో ఏఒక్క  సంక్షేమ పథకం ఆపలేదు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.