SPREAD NEWS;-మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఢిల్లీ వెళ్లి గంజాయి మాదకద్రవ్యాల మీద రాష్ట్రపతి కి కంప్లైంట్ చేసి వచ్చాడు. రాష్ట్రపతి పాలన కావాలని చెప్పాడు. ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఏపీలో గంజాయి నెంబర్వన్ స్థానంలో ఉందని అనటం మనందరికీ తెలిసిందే. ఈ రచ్చ ఈ విధంగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తట్టు జాతీయ క్రైమ్ నివేదిక వెల్లడించింది. ప్రధాన రాష్ట్రాలకంటే ఏపీ మెరుగ్గా ఉందని, మొదటి రెండు స్థానాల్లో యుపి, పంజాబ్, తర్వాత స్థానాల్లో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉన్నాయని. ఆంధ్రప్రదేశ్ మటుకు గంజాయి మాదకద్రవ్యాలను సమర్థవంతంగా కట్టడి చేసి18 వ స్థానంలో ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైసిపి పార్టీ ఫైర్ అయింది.