సాదర స్వాగతం పలికిన ఏపీ గవర్నర్
PREAD NEWS(అమరావతి);-భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ఈనెల 30వ తేదీ నుండి నవంబరు 6వతేదీ వరకూ రాష్ట్రంలోపర్యటించనున్నారు.ఆయన ఈనెల 30వ తేది ఉ.9.45గం.లకు గోవా నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉ.11.35గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తదుపరి స్వర్ణభారతి ట్రస్ట్ కు వెళ్ళి భోజన విరామం అనంతరం సా. 4గం.ల నుండి 5.30 గం.ల వరకూ రైతు నేస్తం వార్షిక అవార్డులు-2021 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని స్వర్ణభారతి ట్రస్ట్ లో రాత్రి బస చేస్తారు.
31వతేదీన ఉ.8.30గం.లకు సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పిస్తారు.తదుపరి రోడ్డు మార్గాన బయలుదేరి ఉ.9.15 గం.లకు విజయవాడ కృష్ణ లంకలోని రామ్ మోహన్ లైబ్రరీని సందర్శిస్తారు.అనంతరం ఉ.9.30గం.లకు అక్కడి నుండి బయలుదేరి 10గం.లకు స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుని 10.30.గం.లకు ఎయిమ్స్ డైరెక్టర్ ఇచ్చే ప్రజెంటేషన్ ను తిలకించిన తదుపరి భోజన విరామం ఇతర కార్యక్రమాల అనంతరం స్వర్ణ భారతి ట్రస్ట్ లో రాత్రి బస చేస్తారు.
నవంబరు 1వ తేదీ ఉదయం స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి బయలుదేరి 9.55 గం.లకు చిన్న అవుట్ పల్లిలోని డా. పిన్నమనేని సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చేరుకుని ఉ.10 గం.ల నుండి 11.30 గం.ల వరకూ 1200 ఎల్పియం పిఎస్ఏ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులు,ఫ్యాకల్టీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.తదుపరి స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకుని సా.4గం.లకు ఐఐపిఏ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో వర్చువల్ గా పాల్గొని స్వర్ణ భారతి ట్రస్ట్ లో రాత్రి బస చేస్తారు.
నవంబరు 2వతేదీ ఉ.8.15 గం.లకు స్వర్ణ భారతి ట్రస్ట్ నుండి బయలుదేరి ఉ.8.30 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్ళి ఉ.10.25 గం.లకు సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు.తదుపరి మధ్యాహ్నం 3.50 గం.లకు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అతిధి గృహానికి చేరుకుని సా.4గం.లకు 61వ జాతీయ డిఫెన్స్ కళాశాల(ఎన్డిసి) కు సంబంధించిన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని పోర్టు ట్రస్ట్ అతిధి గృహంలో రాత్రి బస చేస్తారు.
నవంబరు 3,4 తేదీల్లో పోర్టు ట్రస్ట్ అతిధి గృహం లో బసచేసి 5వతేదీ ఉ.10 గం.ల నుండి 11గం.ల వరకూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.తదుపరి సా.4.25 గం.లకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని డా. వైవియస్ మూర్తి ఆడిటోరియంలో విశాఖ సాహితీ సావనీర్ ఆవిష్కరణ కార్యక్రంలో పాల్గొన్న తదుపరి సా.6.45 గం.లకు విశాఖ పోర్టు ట్రస్ట్ అతిధి గృహానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.నవంబరు 6వతేదీ సా.4.20 గం.లకు ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో పాట్నా బయలుదేరి వెళతారు.