విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రగణంలో దసరా పండుగ ప్రత్యేక పూజలు

       


SPREAD NEWS;- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రగణంలో దసరా పండుగ శ్రీపొట్టిశ్రీరాములు భవనంలో ప్రత్యేక పూజలను చేసి వాహనాలకు టెంకాయలను కొట్టి ఘనంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రాత్రులు ఆదిశక్తి సమగ్ర సుందర స్వరూపం. శక్తి, ఆనందం, చైతన్యం మూర్తిభవించిన పార్వతీ మాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, శుభ ఫలితాలను ప్రసాదించమని ప్రార్థించే రాత్రులే నవరాత్రులు. తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందుతాడని పురాణాలు వచిస్తున్నాయి. అదే విజయదశమి పూజ. విజయాలకు కారకమైన దశమి విజయదశమి. విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది.పది అంటే దశ రాత్రుల పండుగ .. అదే దశరా... దసరా అయ్యింది. 


    ‘ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే

సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః’

మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే రోజు శుభం జరగాలని కోరుకుంటూ విద్యార్థి విద్యార్థులు, బోధనా బోధనేతర సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి సాయి ప్రసాద్ రెడ్డి,సహాయక రిజిస్ట్రార్ సుజయ్,నరసింహారెడ్డి,ప్రసాద్,రాము,సాగర్,జగదీష్,బాషా,ఉస్మాన్ మరియు మహేష్,శీన్నయ్య,దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.