SPREAD NEWS;- విజయవాడ, అక్టోబర్ 7:-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలోని ఇంద్ర కీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం దర్శనం చేసుకున్నారు. దుర్గాదేవి శ్రీ స్వర్ణ కవచాలంకృత రూపంలో దర్శనమిచ్చారు. ఈ మొదటి పూజలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఈ పండగ సీజన్లో కనకదుర్గ దర్శనం కలగటం ఎంతో గొప్పఅని, దసరా అన్ని సంప్రదాయాల్లో జరుపుకుంటారని, తన కుటుంబం కూడా జరుపుకుంటున్దని. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ తల్లి దీవించి కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను దీవించి. సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని. అదేవిధంగా దుర్గమ్మ అమ్మ వారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను దీవిస్తారు.శ్రీ దుర్గా ఆశీస్సులతోనే ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిగా ముందుకుపోవాలని కోరుకుంటున్నట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల జీవితంలో సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. గవర్నర్ దంపతులు పాల్గొని దసరా మొదటి పూజను చేశారు.