SPREAD NEWS(NELLORE);- స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశం ప్రథమ హోం శాఖ మాత్యులు మరియు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున జరిపే జాతీయ ఐక్యత దినోత్సవాన్ని/ రాష్ట్రీయ ఏక్తా దివస్ ని జాతీయ సేవా పథకం మరియు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెక్టార్ ఆచార్య యమ చంద్రయ్య గారు ముఖ్య అతిధి గా మరియు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ కె దినేష్ కుమార్ ఐ ఎ ఎస్ గారు విశిష్ట అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెక్టార్ చంద్రయ్య గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వీరోచిత సంకల్పం గొప్పది అందువలనే ఈ రోజు భారత దేశం కలిసి ఉందని తెలిపారు. స్వాతంత్య్రం రాక ముందు ఎన్నో చిన్న రాజ్యాలుగా విడిపోయిన వున్నా తీసుకు వచ్చి ఒక పెద్ద దేశంగా ఏర్పడటానికి కృషి మరువలేనిదని అన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా భారత దెస అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ గారు జాతీయ ఐక్యత దినోత్సవ/ రాష్ట్రీయ ఏక్తా దివస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విపులంగా విద్యార్థులకు వివరించారు. అందరు పటేల్ గారు లాగ ధృడ సంకల్పం, ఆత్మవిశ్వాసం మరియు సహనం కలిగి వుండాలని తెలిపారు.
మొదట మనం భారతీయులమని తర్వాతే ప్రాంతీయులమని అన్నారు. కులమైన, వర్ణమైన, మతమైనా మరి ఏ దేనిచేత నైనా మనం విడిపోకుండా అందరు కలిసి మెలిసి ఐక్యతతో దేశ పరిరక్షణకు మరియు సమైక్యతకు పాటుపడాలని కోరారు. క్లీన్ ఇండియా భాగంగా జిల్లా చేపట్టిన వివిధ కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తపరచారు. అందరు ప్లాస్టిక్ రహిత నెల్లూరు కోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు. రిజిస్ట్రార్ డా. యల్ వి కె రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో క్యాంపుస్ పరిశుభ్రంగా ఉండటానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
నెహ్రు యువ కేంద్రం మరియు ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. నెహ్రు యువ కేంద్ర యూత్ ఆఫీసర్ డా. ఆకుల మహేంద్ర రెడ్డి NSS మరియు NYKS ఆధ్వర్యం 624 గ్రామాలలో చేపట్టిన క్లీన్ ఇండియా కార్యక్రమాలను వివరించారు. విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వై విజయ అతిధులను ఆహ్వానించగా, డా. జి మేరీ సందీపా సమర్పణ చేశారు. డా. పి త్రివేణి విశ్వవిద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థుల చేత ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, పరీక్షల నియంత్రణ అధికారి డా. సాయి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఆర్. ప్రభాకర్ ఎన్ యస్ యస్ సిబ్బంది జి. స్వాతి,షేక్. ఉస్మాన్ అలీ, డా. శ్రీ కన్య రావు మరియు ఎన్ యస్ యస్ వాలంటీర్లు పాల్గొన్నారు.