బంగోరె గొప్ప పరిశోధకులు వి యస్ యూ రిజిస్ట్రార్ ఎల్ వి కె

     


SPREAD NEWS(NELLORE);-బండిగోపాల్ రెడ్డి గారు గొప్ప తెలుగు బాషా సాహిత్య పరిశోదకులుగా మంచి విమర్సులుగా జర్నిలిస్ట్ లో పని చేసిన అనుభవం గలవాడని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా ఎల్. విజయకృష్ణ రెడ్డి గారు కొనియాడారు. వెంకటచలం మండలం కాకుటురులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని శ్రీ పొట్టి శ్రీరాములు భవన్ నందు తెలుగు శాఖ ఆద్వర్యంలో మంగళవారం బండి గోపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రిజిస్ట్రార్ ఎల్ విజయ కృష్ణా రెడ్డి గారు  పూలమాల వేసి ఘణ నివారులు అర్పించారు.

   


డా ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు మాట్లాడతూ బండిగోపాల్ రెడ్డి ఒంగోరెగా అందరికి పరిచయం అని ఈయన అతి తక్కువ కాలం జీవించిన ఎంతో విలువైన పరిశోదనలు చేశారని, ఈయన ప్రతి పరిశోధన ఎంతో ఆదర్శ వంతమని నేటి పరిశోధకులకు కూడా, ఈయన పరిశోధనలలో సి పి బ్రౌన్ వేమన, కట్టమంచి రామలింగారెడ్డి, కందుకూరి రచనలు, ఇంకా ఎనో ముఖ్యమైనవి ఉన్నాయని చేపచు. ఒంగోరె జిల్లా వాసిగా నెల్లూరులోని “జమీన్ రైతు”  పత్రికలో కూడా కొంతకాలం జర్నిలిస్ట్ గా పని చేశారు. వ్యక్తిగత జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న,  పరిశోదన విషయంలో మాత్రం గొప్ప పరిశోధకుడిగా, నిరంతర పరిశోదకుడిగా ఒంగోరెకు పేరుందని తెలియజేశారు.

     ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ సుజా యస్ నాయర్, సాభాద్యుక్షులు డా.పి.సుబ్బరామరాజు, తెలుగు శాక అధ్యాపకులు రాజారామ్, లక్ష్మీనారాయణ రెడ్డి, విమల, వెంకటేశ్వరులు, ఎన్ యస్ యస్ సమన్వయకర్త డా ఉదయ్ శంకర్ అల్లం, పరిక్షలనియంత్రణ అధికారి సాయి ప్రసాద్ రెడ్డి, సహాయక రిజిస్ట్రార్ సుజయ్ మరియు విద్యార్దిని విద్యార్దులు భోన భోనేతర పాల్గొనారు.