SPREAD NEWS;-అనేక మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కానీ ఇవన్నీ ఒక ఎత్తయితే కుప్పం మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఎత్తు అయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలొ మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నా, వైయస్సార్ పార్టీ నా, కుప్పం తో ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నాడు. చైర్మెన్ అభ్యర్థులుగా టిడిపి నుంచి త్రిలోక్, వైసీపీ నుంచి దర్భా సుదీర్, పోటీలో ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో 25 వార్డులు, 39,261 మంది ఓటర్లు ఉన్నారు.
పరిషత్ ఫలితాలను ఒప్పుకొని చంద్రబాబు నాయుడు, కుప్పంలో డీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం చంద్రబాబు నాయుడు కూడా ఢీ అంటే ఢీ అంటున్నాడు. ప్రత్యేక టీంను రంగంలోకి దింపాడు. దీనికి తగ్గట్టు వైఎస్ఆర్సిపి కూడా తక్కువేం లేదు, ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగి పోయి అంతా తానై వ్యవహరిస్తున్నాడు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ని కుప్పంలో ఇన్చార్జిగా నియమించారు. ఎన్నికల అయ్యేంతవరకు బయటకు రావద్దని ఆదేశించారు. ఎమ్మెల్యే రామానాయుడు ని ప్రత్యేక పరిశీలకుడిగా నియమించారు.
కాళహస్తి ఎమ్మెల్యేలు, తిరుపతి ఎమ్మెల్యే లు, నిరంతరం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు నాయుడు కుప్పం మొన్న వచ్చినప్పుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జోక్యం చేసుకుంటే 2024 ఎన్నికల్లో ఒక్కడిని కూడా గెలవకుండా చేస్తామని హెచ్చరించారు. ఈహెచ్చరికలకు భయపడని వైఎస్ఆర్సిపి తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు, మధ్య కుప్పంలో డిఅంటే డి పరిస్థితి వచ్చింది.చూద్దాంఈ ఎన్నికల్లో ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి. కుప్పం నియోజకవర్గ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫలితం కోసం.