SPREAD NEWS;- ఎన్నికల వేడి రాజుకుంది నెల్లూరు మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ ఘట్టానికి నేటితో తెర పడనుంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ సిపి పార్టీ జోరుగా దాదాపు అన్ని వార్డులలో ప్రచార కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా తెలుగుదేశం శ్రేణులు ప్రచార జోరు ఇంకా కనపడలేదు. అదేవిధంగా నామినేషన్లు ఈ విషయంలో కూడా జంకుతున్నారు. కొన్ని వార్డులకు క్యాండిడేట్ లను సెలెక్ట్ చేయడం కష్టంగా మారింది. జోరుమీదున్న వైఎస్సార్సీపీ తో పోటీ పడాలంటే తెలుగు దేశం పార్టీ కూడా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పోరులో గెలుపు ఎవరిది అని సింహపురి ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ పురపోరులో సింహపురి ప్రజలు ఓటేసేందుకు తయారవుతున్నారు ఎక్కువగా టైం లేకపోవడంతో జోరు పెంచి సింహపురి ప్రజల్లో ఎవరైతే మనసులో ఉంటారొ వారే విజేత అయ్యే అవకాశం. ప్రజల పక్షాన ఎవరు నిలబడతారు, ప్రజా సమస్యల పట్ల ఎవరు చిత్తశుద్ధితో పని చేస్తారో వారే విజేత అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం సింహపురి ప్రజలు ఎవరిని విజేతగా ఎన్నుకుంటారొ.