డెడ్లైన్ క్లోజ్

       


SPREAD NEWS;-జనసేన అధ్యక్షుడు సినిమా హీరో పవన్ కళ్యాణ్  డెడ్లైన్ ముగిసింది. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు, ఇటీవల విశాఖ మీటింగ్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఏడు రోజుల లోపల స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ ప్రభుత్వం తమ విధానాన్ని క్లియర్ గా చెప్పాలి అని అని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించాలి అంటే మొదట రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుందని, మీరు రాసిన లేఖలతో నేను సంతృప్తి చెందడం లేదని, మీకు 22 మంది ఎంపీలు మద్దతు ఉన్నదని తన వెనక ఒక్క ఎంపీ కూడా లేరని ఒక్క ఎంపీ ఉన్న నేనేమిటో నిరూపించే వాడినని చెప్పారు. కానీ వైసిపి సీఎం జగన్ మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. కానీ వైసీపీ నాయకుడు స్పందిస్తూ వైసీపీకి పక్కా వ్యూహం ఉందని, మేము ఆ వ్యూహాన్ని ఫాలో అవుతావని మా నిర్ణయం ఇప్పటికే అందరికీ తెలుసని, అసెంబ్లీలో కూడా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి పంపామని చెప్పారు.