SPREADNEWS(NELLORE);-విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నేడు కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎల్.విజయ కృష్ణా రెడ్డి గారు పాల్గొని వాక్సిన్ కార్యక్రమని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి డోసు, రెండవ డోసు మరియు బూస్టర్ డోసు వేయించుకోని ఉద్యోగులకు మరియు విద్యార్థులకు కోవిడ్ వాక్సిన్ ను వేయించారు. ప్రతి ఒక్కరూ విధిగా రెండవ డోసు వ్యాక్సిన్ చేయించుకొని కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు కరోనా మూడవ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న వేళ అందరూ ప్రభుత్వం సూచించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మాస్క్ లను తప్పనిసరి గా ధరిచ్చాలని బౌతిక దురాన్ని పాటించాలని చేతులను సుబ్బతో కానీ శానిటిజర్ తో పరిశుభ్రంగా ఉంచుకోవాని,జనసంద్రత ఎక్కువగా వున్న ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్ ఎస్ యెస్ విభాగాన్ని మరియు సహకరించిన కసుమురు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. శంకరయ్య గారిని మరియు వారి సిబ్బందిని ఉపకులపతి ఆచార్య సుందరవల్లి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమలో ఎన్ యస్ యస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం ,సహాయక రిజిస్ట్రార్ సుజయ్ కుమార్ ,డాక్టర్ టి. వీర రెడ్డి,ఎన్ యస్ యస్ సిబ్బంది, మరియు ఎన్ యస్ యస్ వాలంటీర్లు తదిరరులు పాల్గొనారు.