SPREADNEWS;-మిసెస్ ఇండియా - ఆంధ్రప్రదేశ్ విజేతగా మరియు మిసెస్ ఛార్మింగ్ 2021 విజేతగా బి.పద్మావతి నిలిచారు. జనవరి 16 న వర్చువల్ పద్ధతిలో జరిగిన పోటీల్లో విజేతలను ఎంపిక చేశారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవా (ఎన్జీవో) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆధ్వర్యంలో, ఆన్‌లైన్ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు. 2021 సెప్టెంబర్ లో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 100 మంది మహిళలు ఎంపిక కాగా ,వారిలో 36 మంది ఫైనల్ పోటీకి అర్హత సాధించారు. ఫైనల్ పోటీలో విజేతగా బి పద్మావతిని మమతా త్రివేది మిసెస్ ఆంధ్రప్రదేశ్ విజేతగా ప్రకటించారు.
.బి పద్మావతి ఎంబీఏ వరకు చదువుకున్నారు.వైజాగ్ ఎండాడ లోని స్కైలాను గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. తన తండ్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెవిటి ,మూగ, అంధుల పాఠశాలకు తన సహాయ సహకారాలు అందజేస్తున్నారు.బి పద్మావతి అనేక ,వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు,పేద విద్యార్థులకు వారి విద్య కోసం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.బి. పద్మావతి శరీర సౌష్టవం కోసం ఆమె యోగా, ధ్యానం, డ్యాన్సులు చేస్తుంటారు.
బి. పద్మావతి మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ విజేతగా ఎంపిక కావడం పట్ల విజయనగరం, విశాఖపట్టణం లోని పలువురు ప్రముఖులు,మహిళా సేవా సంస్థల నాయకులు అభినందనలు తెలియజేశారు.బి పద్మావతి మిస్సెస్ ఆంధ్ర ప్రదేశ్ విజేతగా ఎన్నికైన శుభ సందర్భంగా, రాష్ట్ర ప్రజల తరఫున, మా పత్రిక తరఫున, ఆమెకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం.