సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో సమావేశం సందర్భంగా చిరంజీవి ఏమన్నారంటే.

   


 SPEAD NEWS(అమరావతి);-కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత  ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. 

     అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టిక్కెట్‌ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్‌చేశారు. పెట్టే అమ్మని అన్నీ అడుగుతారు. ఇచ్చేవారినీ కోరుతారు. అందుకే మా కోరికలు కోరుతున్నాం.సినిమా ధియేటర్‌కి ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్‌ ఇంపాక్ట్‌ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.అవి ఉంటేనే కానీ జనాలు ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు.

     మా సినిమాలు విడుదలైన వారంరోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే ఫైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది.తెలుగుతనాన్ని, తెలుగు సినిమాని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్ధానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు.