SPREAD NEWS(అమరావతి);-కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది.
గడచిన 2 ఏళ్లనుంచీ తీవ్ర సంక్షోభం ఉంది.మా కెరీర్‌లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బంది కరంగా ఉంది.
ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్... ఈ తరహా చర్చలు వల్ల తొలగిపోతాయి. మా అందరికీ గత రెండేళ్లు చాలా కష్ట కాలం. ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు.
జగన్‌తో సమావేశం సందర్భంగా రాజమౌళిఏమన్నారంటే.
ఇప్పటివరకూ ఒక రకమైన భ్రమ ఉండేది.సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. అది తొలగిపోయింది. మాతో కలిసి నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది.
జగన్‌తో సమావేశం సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి ఏమన్నారంటే.
సగటు సినిమా బతకాలి.పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా... పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. సగటు సినిమా బతకాలి.హిట్ అయితేనే సినిమాలు చూస్తారు.చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం.భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి.
జగన్‌తో సమావేశం సందర్భంగా అలీ ఏమన్నారంటే.
గతంలో సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడేవి.
శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ సినిమా అయినా హిట్ లేదా ప్లాప్. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు పరిశ్రమలో చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు.
జగన్‌తో సమావేశం సందర్భంగా పోసాని కృష్ణమురళి ఏమన్నారంటే.
చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని.
ప్రేయసిరావే, గాయం, స్నేహితులు... ఇలాంటి వాటికి నేను రాశాను.. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది.
సీఎంగారు చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు.చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి.
కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30వేల టెక్నీషియన్లు ఉన్నారు.