శ్రీ చిన్న జీయర్ స్వామిజీ కలల ప్రాజెక్టును సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్

     


SPREAD NEWS;-రామానుజాచార్య  జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని , శ్రీరామ్ నగర్, లో గురువారం నిర్వహించిన శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాట్లాడుతూ,  ఇంతటి బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని  దర్శించుకున్నందుకు గర్వంగా , గౌరవంగా,  భావిస్తున్నానన్నారు.

     పవిత్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం  రావడం అదృష్టమని,  సమాజంలో వివిధ వర్గాల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేని మత పరమైన విషయాల్లో అందరూ సమానమని, శ్రీ రామానుజుల సందేశం యావత్ ప్రపంచానికి అందిందని గవర్నర్ అన్నారు. సమాజంలో సమానత్వం లేనప్పుడు శ్రీ రామానుజన్ సమానత్వాన్ని ప్రచారం చేశారని, భగవంతుని ముందు అందరూ సమానమేనని అందరూ సమానంగా ఉన్నప్పుడు అంటరానితనం ఉండదని అన్నారు.

    స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీజీ కూడా శ్రీరామానుజుల సందేశంతో స్ఫూర్తి పొందారని, అన్ని వర్గాల ప్రజలలో ప్రచారం చేశారని, సమానత్వాన్ని దీనినే శ్రీరామానుజులు 1000 సంవత్సరాల క్రితమే ప్రచారం చేశారని, గొప్ప సంఘసంస్కర్త అని, స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాడారని,  ఆలయ ప్రవేశానికి నాయకత్వం వహించారు. ఆయనకు చాలా ధైర్యం ఎక్కువ, అదేవిధంగా నమ్మకం, నిబద్ధతతో, సమానత్వం కావాలని సూత్రాలు అద్భుతమైన ఆధ్యాత్మిక సముదాయం దివ్య సంప్రదాయం దివ్య  శ్రీ రామాంజనేయ బ్రహ్మాండమైన విగ్రహం  శ్రీ స్వామీజీ స్వామి కలల ప్రాజెక్టు గా గవర్నర్ అభివర్ణించారు.


    ఇది నిజంగా స్వామి నిబద్ధత, దృఢ సంకల్పం ,కృషి,  సహకారం అయ్యాయని, ఈ కార్యక్రమంలో లో స్వామీజీ శ్రీ  రవి శంకర్ జి,  రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ జి, రామేశ్వర రావు, మరియు   తిరుపతి రూరల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఆశ్రమాన్ని ప్రధాన మంత్రి మోడీజి,దేశ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా జి,  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిజి,  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జి,ఇతర  సీఎంలు, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డిజి,  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి కూడా పాల్గొనబోతున్నారు.ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించటం గర్వంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అన్నారు.