SPREAD NEWS(ONGOLE);-మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటన విజయవంతం. ఒంగోలు ప్రవేశించినప్పటినుండి సభా ప్రాంగణం పోయేదాకా దారి పొడుగునా ఇరువైపుల జనం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. ఉగాది నుండి జనం మధ్యలో ఉంటా అని జనం మధ్యలో మంత్రులు కూడా ఉండాలని ప్రజా సమస్యలే లక్ష్యంగా ముందుకుపోవాలని ఆదేశించిన జగన్, అనుకున్నట్టే జనం మధ్య జగన్.వరుసగా మూడో ఏడాది –వైఎస్సార్ సున్నావడ్డీ(మహిళలు)
రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లమ్మల బ్యాంకు ఖాతాల్లో నేడు (22–04–2022, శుక్రవారం) ఒంగోలులో బటన్ నొక్కి నేరుగా జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
నేడు అందిస్తున్న రూ.1,261 కోట్లతో కలిపి వైఎస్సార్ సున్నావడ్డీ క్రింద ఇప్పటివరకు శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.3,615 కోట్లు. ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు.
నా వార్తల కోసం WWW.SPREADNEWS.IN ఫాలో అవ్వండి(మరో వెబ్సైట్)