Spread News ( Kandukuru ) - జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కందుకూరులో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం, పరిచయ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్, కందుకూరు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మానుగుంట ఆదిరెడ్డి గొప్ప వ్యక్తి, గొప్ప ప్రజాదరణ కల్గిన నాయకుడని, 1972 నుంచి ఆ కుటుంబం ప్రజాసేవలోనే తరించిందని అన్నారు.పెద్ద ఎత్తన ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇండిపెండెంట్ గా గెలిచి ఆదిరెడ్డి ఎదురులేని నాయకుడిగా నిలిచాడని అన్నారు. ఆయన తనయుడిగా మహీధర్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన ప్రజాసేవలో ఉంటే కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సోషల్ ఇంజనీరింగ్ కారణంగా కందుకూరులో మహీధర్ రెడ్డికి కాక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చారని, ముఖ్యమంత్రి నమ్మిన సిద్ధాంతాన్ని గౌరవించాలని కోరారు. 2026 లో నియోజకవర్గాల పునర్విభజనతో మహీధర్ రెడ్డికి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బుర్ర మధుసూదన్ యాదవ్, తాను మహీధర్ రెడ్డి మార్గదర్శకంలో పనిచేస్తామని హామీ ఇచ్చారు. 1972 నుండి ఇప్పటివరకు ఆ కుటుంబం ప్రజాసేవలోనే ఉంది. మొత్తం ఏడు సార్లు ఆ కుటుంబం నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. గతంలో ఈ కుటుంబానికి సహకరించిన మాదిరిగా ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా బుర్ర మధుసూదన్ యాదవ్ కి ఓటుతో సహకరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.
అంతకు ముందు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ విజయానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలు ఎటువంటి అరమరికలు లేకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ సాధించి పెట్టాలని పిలుపునిచ్చారు.
కందుకూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన మహీధర్ రెడ్డి ఆశీస్సులు తనకు అవసరమని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన సూచనల మేరకు పని చేస్తానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అశీస్సులతో, ఆయన ఆదేశాల మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. పార్టీ ఎజండానే తన ఎజండా అని, వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. మహీధర్ రెడ్డి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన బాటలోనే నడవలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు ఉన్నారని, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు పోటీలో పెట్టారని, ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నా సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్, సుకుమార్ రెడ్డి నాయకులు,కార్యకర్తలు పెద్దెత్తన పాల్గొన్నారు.